సినీ నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున కోర్టులో పర్మినషన్ దావా కూడా వేశారు. అయితే ఆ కేసికి సంబంధించి మంత్రి కొండా సురేఖ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రిప్లై ఫైల్ చేశారు. మంత్రి తరఫున ప్రముఖ న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టులో సమాధానాన్ని ఫైల్ చేశారు.
అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.