Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ జోడీ నుంచి ‘అఖండ 2 – తాండవం’ కోసం అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా, ఈ చిత్రంపై సంచలన అప్‌డేట్ బయటకొచ్చింది. సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ‘అఖండ 2’లో కీలక పాత్రలో నటించనున్నారట. ఆమె ఎంట్రీతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. విజయశాంతి, తన దమ్మున్న నటనతో తెలుగు సినిమాలో తిరుగులేని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య డైనమిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటు విజయశాంతి నటన సినిమాకు మరో హైలైట్ కానుందని టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ‘అఖండ 2’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ భారీ చిత్రం మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.
