delhi: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఇటీవల వరుసగా నష్టాల్లో కూరుకుపోయిన సూచీలు తాజాగా బలమైన రికవరీ చూపించాయి. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం మరింత బలపడింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ 855 పాయింట్లు పెరిగి 73,105 పాయింట్ల వద్ద , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ 273 పాయింట్లు లాభపడి 22,217 వద్ద ముగిశాయి.
ప్రధాన రంగాల్లో కొనుగోళ్ల ఉత్సాహం
బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ, ఫైనాన్స్, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల హవాతో మార్కెట్లు బలపడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హెవీవెయిట్ షేర్లు పెరుగుదలతో మార్కెట్‌కు కొత్త ఊపొచ్చింది.
విదేశీ పెట్టుబడులు – మార్కెట్లకు బలమైన మద్దతు
ఇటీవల విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్లవైపు మొగ్గు చూపుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దేశీయ ఇన్వెస్టర్లలోనూ నమ్మకాన్ని పెంపొందించి, మార్కెట్లకు బలమైన మద్దతుగా నిలిచింది.
ఇన్వెస్టర్లకు ఊరట
ఈరోజు మార్కెట్ల ప్రదర్శనతో ఇన్వెస్టర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. గత వారం రోజులుగా నష్టాల బాట పట్టిన మార్కెట్లకు ఈ లాభాల పరుగులు కొంతవరకూ ఊరటను కలిగించాయి.

