Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’, కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 41 ఏళ్లు దాటినా సింగిల్‌గా ఉన్న త్రిష పెళ్లిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో ఆమె మాట్లాడుతూ, “నాకు పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదు. అందుకే దానికి దూరంగా ఉన్నాను. పెళ్లి కాకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు,” అని క్లారిటీ ఇచ్చింది.
Also Read: SSMB 29: ఎస్‌ఎస్‌ఎంబీ 29లో భారీ వాటర్ సీక్వెన్స్!
Trisha: త్రిష మరో అడుగు ముందుకేసి, “నా కెరీర్, సినిమాలు, ఫ్యామిలీపైనే ఫోకస్ చేస్తున్నాను. పెళ్లి జరిగితే ఓకే, లేకపోయినా ఓకే. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. బహుషా పెళ్లి, పిల్లలు నాకు సెట్ కాకపోవచ్చు,” అంటూ క్రేజీ కామెంట్స్ చేసింది. గతంలో ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగి విఫలమైన నేపథ్యంలో త్రిష వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. “అసలు త్రిష ఏం చెబుతోంది? ఇంతలోనే ఇలా ఎందుకు మాట్లాడింది?” అంటూ ఫ్యాన్స్ డౌట్‌లు వ్యక్తం చేస్తున్నారు.

