IPL: పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ బౌలర్ల అద్భుత విజయం తక్కువ స్కోరుకే కట్టడి

IPL: ఐపీఎల్ డబుల్ హెడర్‌లో ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఛండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో ఆర్సీబీ బౌలింగ్ దళం పంజాబ్‌ను వారి సొంత గడ్డపైనే తక్కువ స్కోరుకే అడ్డుకున్నారు.

టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేయగలిగింది. టాపార్డర్‌లో ప్రభ్ సిమ్రన్ సింగ్ 33, ప్రియాన్ష్ ఆర్య 22 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్‌లో జోష్ ఇంగ్లిస్ 29, శశాంక్ సింగ్ 31, మార్కో యన్సెన్ 25 పరుగులతో కొంత స్థిరతనిచ్చారు.

అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 6 పరుగులకే అవుట్ కావడం, నేహల్ వధేరా (5), మార్కస్ స్టొయినిస్ (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో పంజాబ్ భారీ స్కోర్‌ చేయలేకపోయింది.

ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మరియు సుయాష్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రొమారియో షెపర్డ్ ఒక వికెట్ తీశాడు. పంజాబ్‌ను కట్టడి చేయడంలో వారి పాత్ర కీలకంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎలా ఛేజ్ చేస్తుందో చూడాల్సిందే.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *