Prabhas

Prabhas: ప్రభాస్ కి సీరియస్.. విదేశాలకు వెళ్లిన డార్లింగ్!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ విదేశాలకు వెళ్లారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో మోకాళ్లకు సర్జరీ చేయించుకున్న ప్రభాస్‌కు ప్రస్తుతం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన తన డ్రీమ్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని ఓ సుందరమైన పల్లెటూరికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ మూడు నుంచి నాలుగు వారాలపాటు ప్రభాస్ సేదతీరనున్నారు. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఈ గ్రామంలో ఆయన మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Short News: ప్రయాగ్ రాజ్ లో భారీ అగ్ని ప్రమాదం

Prabhas: ఇటలీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభాస్ తన రాబోయే ప్రాజెక్టులపై ఫోకస్ చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్‌లో ఆయన చేరనున్నారు. అలాగే, ‘రాజా సాబ్’ చిత్రీకరణ కోసం ప్రత్యేక డేట్లు కేటాయించాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. మరి, ఇటలీలో విశ్రాంతి తర్వాత ప్రభాస్ ఎలాంటి జోష్‌తో సెట్స్‌పై అడుగుపెడతారో చూడాలి!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్.. రీమేక్ కాదు, ఒరిజినల్ మాస్ బొమ్మ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *