L2 Empuraan OTT

L2 Empuraan OTT: ఓటిటిలో ఎల్ 2 ఎంపురాన్!

L2 Empuraan OTT: మలయాళ సినిమా ‘లూసిఫర్’ సీక్వెల్‌గా వచ్చిన ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, థియేటర్లలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 24 నుంచి ‘ఎల్2 ఎంపురాన్’ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ, ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. మోహన్‌లాల్ యాక్షన్, పృథ్వీరాజ్ డైరెక్షన్ కలగలిసిన ఈ చిత్రం సౌత్ సినిమా ప్రియులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. ఓటీటీ వేదికపై ఈ సినిమా మరోసారి హవాను చూపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *