Pawan Kalyan: నడిచే దారిలో తోడుగా చెప్పులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ఫూర్తిదాయక చర్య గిరిజనుల హృదయాలను తాకింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామాన్ని ఆయన ఈ నెల 7న సందర్శించారు. అప్పట్లో వృద్ధ గిరిజన మహిళ పాంగి మిత్తు చెప్పుల్లేకుండా నడుచుకుంటూ వచ్చి పవన్‌కి స్వాగతం పలికారు. ఆమె పరిస్థితిని గమనించిన పవన్ కల్యాణ్ కరిగిపోయారు.
Also Read: Hyd News: వేట కొడవలితో ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి
Pawan Kalyan: వెంటనే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమైన చెప్పుల సైజులు సేకరించాలని సూచించారు. కొద్ది రోజుల్లోనే 345 మందికి చెప్పులు పంపించారు. ఆయన కార్యాలయ సిబ్బంది, స్థానిక సర్పంచ్ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వాటిని అందించారు. కొత్త చెప్పులతో మురిపెంగా మెరిసిపోతూ, గిరిజన మహిళలు చిరునవ్వులు చిందించారు. తమ కష్టాన్ని గుర్తించి స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.