Pawan Kalyan: వేటగాళ్ల ఉచ్చులో మృతిచెందిన చిరుతపై పవన్‌ కల్యాణ్‌ ఆవేదన

Pawan Kalyan: అన్నమయ్య జిల్లా పొన్నూటిపాలెం వద్ద ఇటీవల వేటగాళ్ల ఉచ్చు పట్టుకుని ఓ చిరుత మృతిచెందిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. అడవి జీవాలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైనా ఉందని అన్నారు. ఈ ఘటన వింటే ఎంతో బాధ కలిగిస్తోందని పవన్ పేర్కొన్నారు.

చిరుత మృతికి కారణమైన వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ జీవుల సంరక్షణకు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు విచారణ అధికారిగా చలపతిరావును నియమించారు. కేసు పురోగతిని పర్యవేక్షిస్తూ, అవసరమైన సూచనలు ఇవ్వాల్సిందిగా అటవీశాఖ సలహాదారైన మల్లికార్జునరావుకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

జనసేన పార్టీ ప్రకృతి సంరక్షణకు, వన్యప్రాణుల రక్షణకు కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి దారుణ సంఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *