Coolie

Coolie: కూలీ తెలుగు రైట్స్ కి భారీ డిమాండ్!

Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘కూలీ’ షూటింగ్ దాదాపు పూర్తయింది. రజనీ తన భాగం చిత్రీకరణ ముగించగా, మిగిలిన షూటింగ్‌ను లోకేష్ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు, ఇది అభిమానుల్లో హైప్‌ను పెంచింది. చిత్ర బృందం ఆగస్టు 14న ‘కూలీ’ విడుదలను అధికారికంగా ప్రకటించింది. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Retro: రెట్రో ట్రైలర్: టైం ఫిక్స్!

Coolie: ఇదిలా ఉంటే, ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం మేకర్స్ ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ధరకు హక్కులు అమ్మితే, తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. అప్పుడే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ సాధ్యమవుతుంది. ఈ భారీ డిమాండ్ నిజమైతే, రజనీ మరోసారి తన స్టామినా చాటుకునే అవకాశం ఉంది. ‘కూలీ’ తెలుగు మార్కెట్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

కూలీ మూవీ సాంగ్  : 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajinikanth: సైమన్ ను ఆకాశానికెత్తేసిన దేవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *