Ponnavolu Vs Ambati

Ponnavolu Vs Ambati: వైసీపీ లీగల్‌ సెల్‌ చీఫ్‌గా అంబటి?

 Ponnavolu Vs Ambati: వైసీపీలో జైళ్ల బాట పడుతున్న క్లయింట్లని కాపాడుకునేందుకు ఆ పార్టీ న్యాయ కోవిదులైన పొన్నవోలు, అంబటి చేస్తున్న పోరాటాలు రసవత్తరంగా ఉంటున్నాయి! ఒకవైపు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమర శంఖం పూరిస్తూ తన వాదనలతో కోర్టు బల్లలు బద్దలు కొడుతుంటే… మరోవైపు అంబటి రాంబాబు ఎవరూ పురమాయించకుండానే పార్టీ క్లయింట్ల కోసం కోర్టు లోపలా, బయటా.. ఎక్కడ పడితే అక్కడ వాదించేస్తున్నారు. సెక్షన్ల సుడిగుండంలోకి నెట్టేస్తూ పోలీసులకే చెమటలు పట్టిస్తున్నారు. ఇలా జైలుకు వెళ్లే వైసీపీ నేతలను కాపాడేందుకు ఇద్దరి మధ్యా పోటీ పీక్స్‌లో ఉంటోంది.‘లీగల్ లెజెండ్’ టైటిల్ కోసం జగన్‌ వద్ద దరఖాస్తు పెట్టుకున్న ఈ ఇద్దరు లాయర్లు.. టైటిల్‌ రాకపోయినా.. కనీసం టికెట్‌ అయినా కన్ఫామ్‌ అవ్వకపోతుందా అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారట.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ హైకమాండ్‌కు ఫేవరెట్ లాయర్. చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ తరఫున 52 రోజుల రిమాండ్ సాధించిన ఘనత పొన్నవోలు సొంతం. కానీ, ఇప్పుడు వైసీపీ నేతల కేసుల్లో ఆయన వాదనలు కామెడీ స్కిట్లలా మారాయి. పోలీసు వాహనాల్నే వెంబడించి, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని పోలీసు వాహనం నుండి కిందికి లాగి కొట్టాలని చూశారు గోరంట్ల మాధవ్‌. అంతటితో ఆగకుండా ఎస్పీ ఆఫీస్‌లోనే రౌడీ రంగయ్యలా రెచ్చిపోయాడు. పోలీసు అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న గోరంట్ల మాధవ్‌… పాలిటిక్స్‌లో పడి సెక్షన్లు, చట్టాలు మర్చిపోయాడేమో… మళ్లీ గుర్తు చేద్దాం అనుకున్న పోలీసులు ‘యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌’ అనేశారు. ఆ వెంటనే గోరంట్ల జైలుకెళ్లకుండా కాపాడే బాధ్యతను పొన్నవోలుకు అప్పగించారు జగన్.

పోలీస్ కస్టడీలో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించిన గోరంట్ల… వీడియో సాక్ష్యాలతో సహా లడ్డూలా దొరికిపోయాడు. అయిననూ పోయిరావలె కోర్టుకు అనుకుంటూ.. జగన్‌ ఆదేశాలను పాటిస్తూ వాదనలకు అటెండ్‌ అయ్యారు ది గ్రేట్‌ లాయర్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి. నల్లకోటు జులిపించి కోర్టులోకి దూసుకెళ్లిన పొన్నవోలు… లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా మా క్లయింట్‌ని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కన్నెర్ర చేసి, బల్లగుద్ది మరీ ప్రశ్నించారు. అంతే! కోర్టు హాల్‌లో అందరూ ఒక్కసారిగా షాక్! గోరంట్ల ఎంపీ కాదన్న సంగతి పొన్నవోలుకు తెలీదా? అంటూ సభికులంతా గుసగుస లాడుకున్నారు. జడ్జి చివరకు 14 రోజుల రిమాండ్ విధించారు. గోరంట్ల మాధవ్‌ రాజమండ్రి జైలుకు షిఫ్ట్ అయ్యారు! అయితే… కోర్టు బయట కూడా ఆయన అదే తరహాలో మీడియా గొట్టాల ముందు వాదించారు.

Also Read: Gorantla Madhav Arrest: గోరంట్ల అంతగా రెచ్చిపోయింది ఇందుకా..!!

Ponnavolu Vs Ambati: “మా పార్టీ అధినేత సతీమణినే దూషించిన ఓ దుర్మార్గుడిని.. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా, మా మాధవ్‌ ధైర్య సాహసాలు ప్రదర్శించి, తన వెహికల్‌తో పోలీస్‌ వెహికల్‌ని చేజ్‌ చేసి అడ్డగించారు. అది తప్పెలా అవుతుంది” అంటూ జర్నలిస్టు మిత్రుల్ని ప్రశ్నించేసరికి.. ఎవ్వరీ ఈ పాయింట్‌లో ఉన్న సూక్ష్మార్థమేంటో అర్థంకాక తలలు గోక్కున్నారు. దీంతో ఒక్కసారిగా పొన్నవోలు విషయంలో చర్చ ప్రారంభమైంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. పొన్నవోలు ట్రాక్ రికార్డ్ చూస్తే, పోసాని, వల్లభనేని వంశీ కేసుల్లోనూ ఇలాగే జైలుకు పంపిన ఘనత ఆయనది. దీంతో పొన్నవోలు వాదనలు కోర్టులో కాదు, రాజకీయ సభల్లోనే సూటవుతాయేమో! అంటూ క్యాడర్‌ చర్చించుకోవడం మొదలైంది.

ఇక అటకమీదున్న నల్లకోటుకు ఇటీవలే దుమ్ముదులిపిన అంబటి రాంబాబు… అతి కొద్ది కాలంలోనే వెల్‌ నోన్‌ వైసీపీ లాయర్‌గా రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. పోలీసులు తన ఫిర్యాదులను నమోదు చేయడం లేదని హైకోర్టులో నల్లకోటు వేసుకుని వాదించారు. దాంతో పోలీసులు భయపడిపోయి… కోర్టు ఆర్డర్‌కు ముందే కేసులు రిజిస్టర్ చేసేశారు. గోరంట్ల అరెస్టు సమయంలోనూ సెక్షన్లతో పోలీసులను గడగడలాడించారు అంబటి రాంబాబు. ఇలాంటి వకీల్‌సాబ్‌ ఉండగా… పొన్నవోలుతో విఫలయత్నాలు చేయించడం దేనికీ, అంబటినే లీగల్ టీం చీఫ్‌గా పెడితే పోలా అన్న డిమాండ్లు ఇప్పుడు వైసీపీ, క్యాడర్‌ లీడర్ల నుండి వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా… జగన్ దృష్టిలో పొన్నవోలుకు ఫ్యాన్ బేస్ ఉన్నా, కేసులు గెలిచే సత్తా మాత్రం ఒక్క అంబటికే ఉందని క్యాడర్‌ గుసగుసలాడుతున్నారు. చూడాలి మరి.. ఈ ఇద్దరు వైసీపీ వారియర్స్‌లో “లీగల్‌ లెజెండ్‌” టైటిల్‌ని ఎవరు గెల్చుకోబోతున్నారో!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *