Hibiscus Flower: మనందరికీ తెలిసిన అందమైన పువ్వు మందారం, దేవుడి పూజలకే కాదు, ఆరోగ్య రహస్యాలకు, సౌందర్య సంరక్షణకు మించిన ఔషధం అని మీకు తెలుసా? ఆయుర్వేదం ప్రకారం మందార పువ్వు, ఆకులు అనేక సమస్యల పరిష్కారంగా పనిచేస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ, బరువు తగ్గే వరకూ దీనివల్ల లాభాలే లాభాలు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మందార పువ్వులో ఉండే సహజ ఫైబర్ శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆమ్లాన్ని సమతుల్యం చేస్తూ గ్యాస్, అజీర్నం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. మందార ఆకులతో టీ తాగడం వల్ల పేగుల కదలికలు సవ్యంగా జరుగుతాయి. దీనివల్ల మలబద్ధకం నివారించబడుతుంది.
రక్తహీనతకు శాశ్వత పరిష్కారం
ఈ పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజు మందార మొగ్గల రసం తీసుకుంటే, శరీరంలోని హెమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది మహిళల్లో మరింత ప్రయోజనం ఇస్తుంది, ముఖ్యంగా రక్తలోపంతో బాధపడేవారికి.
బరువు తగ్గించడంలో సహాయం
మందార ఆకులతో చేసిన టీ బాడీ మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, దీని వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. మందార టీ తాగడం శక్తిని పెంచి శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
చర్మ సౌందర్యానికి సహాయపడుతుంది
మందార పొడిలో ఉండే సహజ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించి స్కిన్ కలర్ మెరుగుపరుస్తాయి. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ఉండే ముడతలు, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. మందారం పొడి వల్ల హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది.
Also Read: Vitamin D Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే జాగ్రత్త
జుట్టుకు ప్రాణం పోస్తుంది
మందార పూలతో తయారైన ఆయిల్ జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తుంది. మందారలో ఉండే న్యూట్రియంట్లు జుట్టుకు తేమను అందించి రాలకుండా చేస్తాయి. జుట్టు మందం, బలమైనదిగా మారుతుంది. డాండ్రఫ్ నివారణలోనూ ఇది సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి తోడ్పాటు
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటు సమస్య ఉన్నవారు మందార టీని రోజు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
ఎలా ఉపయోగించాలి?
మందార టీ: ఎండిన మందార పువ్వులను నీటిలో మరిగించి తాగవచ్చు. తేనెతో కలిపితే రుచి మరియు ప్రయోజనాలు రెండూ ఎక్కువవుతాయి.
మందార పొడి: చర్మానికి స్క్రబ్‌లా ఉపయోగించవచ్చు.
మందార ఆయిల్: జుట్టుకు మర్దనా చేయవచ్చు.
రసం రూపంలో: మొగ్గలను రుబ్బి తీసిన రసాన్ని తాగవచ్చు – కానీ మితంగా.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

