AA22

AA22: భారీ బడ్జెట్ తో షాకిస్తున్న AA22!

AA22: ఇండియన్ సినిమా ఇప్పుడు మరో సంచలన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది! అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలిసి తెరకెక్కిస్తున్న AA22 సినిమా ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో రెండో అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా నిలిచిన ఈ మూవీ, రాజమౌళి-మహేష్ బాబు రూ.1000 కోట్ల ప్రాజెక్ట్ తర్వాత స్థానం సంపాదించింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే భారత మార్కెట్‌లో కనీసం రూ.1600 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత రికార్డ్ హోల్డర్ పుష్ప 2 కలెక్షన్స్ రూ.1265 కోట్లు మాత్రమే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, జవాన్ విజయంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన అట్లీ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమా? ఈ లక్ష్యాన్ని సాధిస్తే, భారతీయ సినిమా చరిత్రలో కొత్త ఒరవడి సృష్టించడం పక్కా! అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుందా? చూడాలి మరి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *