PM Modi

PM Modi: సామూహిక అత్యాచారం.. నిందితులను విడిచిపెట్టొద్దన్న ప్రధాని మోదీ

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన శుక్రవారం వారణాసి చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే, వారణాసిలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు గురించి ప్రధాని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్‌ను ప్రశ్నించారు. ఆయన కమిషనర్ నుండి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్నారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని చెప్పారు.

ఈ సంఘటన 15 రోజుల క్రితం జరిగింది
కేసు పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును కమిషనర్ ప్రధాని మోదీకి అందించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సహా 9 మందిని జైలుకు పంపినట్లు ఆయన తెలిపారు. మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కేఫ్‌ను సీజ్ చేశారు. నిజానికి, మార్చి 29న వారణాసిలో ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థినిపై 23 మంది అబ్బాయిలు 7 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఆమెను రోడ్డుపై విసిరేసి పారిపోయారు. ఆ విద్యార్థిని దిక్కుతోచని స్థితిలో ఇంటికి చేరుకుని రెండు రోజులు అపస్మారక స్థితిలో ఉంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పడు వారణాసి వెళ్లిన ప్రధాని మోదీ ఈ కేసు విషయమై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Metro Expansion: ఎయిర్​పోర్ట్ టు ఫ్యూచర్​ సిటీ.. 40 కి.మీ. మేర మెట్రో విస్తరణ   

అనంతరం విమానాశ్రయం నుండి, ప్రధాని హెలికాప్టర్ లో మెహందీ గంజ్ చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు సీఎం యోగి స్వాగతం పలికారు. 3,884 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులను ప్రధాని ఇక్కడ ప్రారంభించారు. కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దీని తరువాత, ప్రధాని మోదీ దాదాపు 35 నిమిషాల పాటు బహిరంగ సభలో ప్రసంగించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *