Oscar Awards: భారతీయ సినిమా చరిత్రలో ఘన విజయం సాధించిన “RRR” సినిమా ఆస్కార్‌తో ప్రపంచ వేదికపై సత్తా చాటింది. గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటన, “నాటు నాటు” పాట ఆస్కార్‌ను అందుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్‌లో సరికొత్త క్యాటగిరీ ప్రవేశం సంచలనంగా మారింది. ఆస్కార్ సంస్థ తాజాగా “స్టంట్ డిజైన్” అనే కొత్త అవార్డును ప్రకటించింది. ఈ ప్రకటనలో హాలీవుడ్ చిత్రాలు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టంట్లతో పాటు RRRలో రామ్‌చరణ్ స్టంట్‌ను కూడా హైలైట్ చేశారు. దీంతో రామ్‌చరణ్ అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. అయితే, RRRకు ఈ అవార్డు అందుబాటులో లేనప్పటికీ, రామ్‌చరణ్ భవిష్యత్ చిత్రాల్లో RRR తరహా స్టంట్లు ఉంటే ఆస్కార్ నామినేషన్‌కు అవకాశం ఉంది. ఈ అవార్డు 2027లో విడుదలయ్యే చిత్రాల నుంచి ప్రారంభమవుతుందని, 2028లో అవార్డు విజేతలను ప్రకటిస్తారని ఆస్కార్ సంస్థ తెలిపింది. అంతేకాదు, అదిరిపోయే స్టంట్లతో వచ్చే సినిమాలు మాత్రమే ఈ క్యాటగిరీలో చోటు సంపాదిస్తాయని స్పష్టం చేసింది. రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు ఇది ఖచ్చితంగా శుభవార్తే!
