Tahawwur Rana

Tahawwur Rana: తహవూర్ రాణాకు 18 రోజుల NIA కస్టడీ

Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవూర్ రాణాను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 18 రోజుల NIA కస్టడీకి పంపింది. ఆ ఏజెన్సీ కోర్టును 20 రోజుల రిమాండ్ కోరింది. ప్రత్యేక NIA జడ్జి చంద్రజిత్ సింగ్ ఈ కేసును క్లోస్డ్ రూమ్ లో విచారించి, గురువారం తెల్లవారుజామున 2 గంటలకు తీర్పు ప్రకటించారు.

64 ఏళ్ల తహవ్వూర్ రాణాను గురువారం అమెరికా నుండి భారతదేశానికి తీసుకువచ్చారు. రాణాను తీసుకువచ్చిన US గల్ఫ్‌స్ట్రీమ్ G550 విమానం గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని పాలం టెక్నికల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడ అతనికి వైద్య పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత నేరుగా NIA ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.
భారతదేశానికి చేరుకున్న తర్వాత, రానా మొదటి ఫోటో కూడా బయటకు వచ్చింది. అందులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అతన్ని పట్టుకుని ఉన్నట్లు కనిపించారు. ఢిల్లీలోని తీహార్ జైలులో రాణాను అత్యంత భద్రత కలిగిన వార్డులో ఉంచనున్నారు.

అయితే, అతన్ని ఎప్పుడు, ఏ వార్డులో ఉంచాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దర్యాప్తు సంస్థ NIA – నిఘా సంస్థ RAW ల సంయుక్త బృందం బుధవారం రానాతో కలిసి అమెరికా నుండి బయలుదేరింది.
NIA తరపున కోర్టులో వాదనలు ఇలా..
ముంబై దాడి కుట్రను బయటపెట్టాలంటే, వారిని అదుపులోకి తీసుకుని విచారించడం చాలా ముఖ్యం. ఉగ్రవాద దాడులు చేయడంలో రానా పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతుంది.

Also Read: Kavita: పవన్ అన్ ఫార్చునేట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు.

Tahawwur Rana : ముంబై దాడిలో రెండవ నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ భారతదేశానికి వచ్చే ముందు తహవ్వూర్ రాణాతో మొత్తం ఆపరేషన్ గురించి చర్చించాడు. దాడి సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఊహించిన హెడ్లీ, తన ఆస్తుల వివరాలను తెలియజేస్తూ రాణాకు ఒక ఇమెయిల్ పంపాడు.
కుట్రలో ఇలియాస్ కాశ్మీరీ – అబ్దుర్ రెహమాన్ ప్రమేయం గురించి హెడ్లీ రాణాకు తెలియజేశాడు.
NIA తరపున న్యాయవాది దయన్ కృష్ణన్ వాదించగా, రాణా తరపున న్యాయవాది పియూష్ సచ్‌దేవా కేసును వాదించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana News: కాంటా కావ‌డం లేద‌ని రైతు మ‌న‌స్తాపం.. ధాన్యం త‌గల‌బెట్టేందుకు విఫ‌ల‌య‌త్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *