Jagan Target Police: ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న శవ రాజకీయాలను, ప్రజల్ని, పార్టీ క్యాడర్‌ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాటల్ని, పోలీసులపై ఆయన బెదిరింపు ధోరణిని పరిశీలిస్తే.. జగన్ అసలు టార్గెట్ ఏంటన్నది అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో గొడవలు, రాజకీయ హత్యల్ని ప్రేరేపించి, మరో రక్త చరిత్ర లిఖించి.. చావులపై నడుచుకుంటూ వెళ్లి సీఎం కుర్చీ అధిరోహించాలని ఆయన భావిస్తున్నట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. విపక్ష నేతగా ప్రభుత్వ పాలసీలపై బాధ్యతాయుతమైన విమర్శలుండవు, ప్రజల సమస్యలపై పోరాటాలుండవు, వచ్చే నాలుగేళ్లు.. ఉండేది కేవలం హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు, సానుభూతి నాటకాలు, రక్త చరిత్రలేనని జగన్ తీరు స్పష్టం చేస్తోందంటున్నారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు, ఆ చావును సానుభూతి సాధనంగా మలచుకున్నారు జగన్. కాంగ్రెస్‌ను వీడి, వైసీపీని స్థాపించి రాజకీయ యాత్ర మొదలెట్టారు. 2019లో బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగినప్పుడు, ఆ శవాన్ని కూడా ఓట్ల కోసం వాడుకున్నారు. ఆ రక్త చరిత్ర ఫలితంగా 2019లో సీఎం కుర్చీ ఎక్కారు. కానీ, అధికార దాహం, ధన వ్యామోహం, ఆస్తుల కాంక్షతో కన్న తల్లిని, చెల్లెలిని ఇంటి నుంచి గెంటేసిన జగన్, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం రాష్ట్రంలో రక్తపాతం సృష్టించేందుకు సిద్ధపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.
Jagan Target Police: భయపెట్టడం, బెదిరించడం, బలి తీసుకోవడం. జగన్ రాజకీయ శైలి… ఒక నేరగాడి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. 2024 ఎన్నికల్లో ప్రజలు ఆయన అరాచక
పాలనను తిరస్కరించి, వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా, నెల తిరక్కుండానే… నేను త్వరలో మళ్లీ సీఎం అవుతా అంటూ… అధికారులను, పోలీసులను, ప్రభుత్వ యంత్రాంగాలను, వ్యవస్థలను బెదిరించడం మొదలుపెట్టారు. పులివెందులలో డీఎస్పీ మురళీనాయక్‌ను పిలిపించి, “మేం అధికారంలోకి వస్తాం, నీ అంతు చూస్తాం” అని హెచ్చరించారు. తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బారాయుడికి, అసెంబ్లీలో అధికారి మధుసూదన్ రావుకు కూడా జగన్ నుండి ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి. ఈ రకంగా వ్యవస్థల్ని బ్లాక్‌మెయిల్ చేయడం బహుషా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎప్పుడూ చూసుండరు.
Also Read: Pawan True Leader: అడవి తల్లి ఆశీస్సులే అంజనీ ‘పుత్రుడి’కి అండ
జగన్ టార్గెట్ స్పష్టం… రాష్ట్రంలో గొడవలు సృష్టించి, రాజకీయ హత్యలను ప్రేరేపించి, సొంత క్యాడర్‌నే బలిచేసి, వారి చావులపై సానుభూతి రాజకీయం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు. రాప్తాడు ఘటనలో ఇదే జరిగిందంటున్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి, హెలిప్యాడ్ వద్ద రచ్చ చేయించి, కేసుల్లో ఇరికించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ద్వారా “ఇళ్లలో నుండి బయటకు లాగి కొడతాం, వెంటబడి నరుకుతాం” అని బెదిరింపు ప్రకటనలు చేయించడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఈ రక్తపాతంలో బలయ్యేది వైసీపీ కార్యకర్తలే, లాభం పొందేది జగన్ మాత్రమే. ఆయన లక్ష్యం.. కార్యకర్తల చావుల ద్వారా సానుభూతి సంపాదించి, మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం. అందుకే.. ఒక నేరగాడి వ్యూహంలో చిక్కి.. వైసీపీ క్యాడర్ బలవ్వకండి అంటూ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.
Jagan Target Police: అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, దాడులు చేయించిన జగన్, ఇప్పుడు అధికారం కోల్పోయి కూడా “గుడ్డలు ఊడదీస్తాం, పాతేస్తాం” అంటూ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారన్న అభిప్రాయాలు గట్టిగా వినబడుతున్నాయి. ప్రజలు 2024లో జగన్ నియంతృత్వాన్ని తిరస్కరించారు. కానీ, ఆయన బుద్ధి మార్చుకోలేదు. తన క్యాడర్‌ను బలిపశువులుగా వాడుకుంటూ, రాష్ట్రాన్ని రక్తసిక్తంగా మార్చి, అధికారాన్ని అందుకోవాలనే కుటిల ఆలోచనలో జగన్ ఉన్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయ్. జగన్ అసలు టార్గెట్.. రక్త చరిత్ర రాసి, సీఎం కుర్చీ ఎక్కడమేనని, కూటమి ప్రభుత్వం ఈ నేరపూరిత రాజకీయాలను అడ్డుకోకపోతే, ఆంధ్రప్రదేశ్ మరో రక్తపాతానికి సాక్ష్యం కావచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం జగన్‌ను ఏరకంగా నిలువరిస్తుందో వేచి చూడాలి.