Mohammed Shami: ఫిట్‌నెస్‌పై మహ్మద్ షమి ఫోకస్.. ప్రాక్టీస్ షురూ

Cricket: తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, ఇకపై పూర్తి దృష్టి ఫిట్‌నెస్‌పైనే పెడుతానని టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్ తర్వాత షమి చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షమి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకున్న షమీ.. రంజీ బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఫిట్‌నెస్‌ను సాధించి కనీసం న్యూజిలాండ్‌తో సిరీస్‌కైనా వద్దామని భావించిన షమీకి మళ్లీ గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో న్యూజిలాండ్ జట్టుతో టెస్టు సిరీస్‌తోనే కాకుండా ఆస్ట్రేలియా పర్యటనకూ కష్టమేనని తేలిపోయింది.

అయితే ప్రస్తుతం షమి కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత జట్టుకు సెలక్ట్ కావాలని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రానున్న బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియాలో చోటు సంపాదించాలనే లక్ష్యంతో కనిపిస్తున్నాడు. దీని కోసం ఫిట్‌నెస్ సాధించడంపై పూర్తి దృష్టి సారించాడు. తనకు ఎలాంటి నొప్పి లేదని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలోనే దేశవాళీ క్రికెట్‌లో ఆడతానని షమి స్పష్టం చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటి భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని వివరించాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ క్రికెట్‌లో అడుగుపెడతానని షమి ధీమీ వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *