PKL: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ విక్టరీతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 36–32 స్కోరుతో బెంగళూరు బుల్స్ జట్టుపై విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌లో ప్రతీక్ దహియా 8, హిమాన్షు 7 పాయింట్లు సాధించారు.
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39–34 తేడాతో బెంగాల్ వారియర్స్ జట్టుపై విక్టరీ కొట్టింది. జైపూర్ టీమ్ లో కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో సత్తా చాటగా, అభిజిత్ మలిక్ 7 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ జట్టు తరఫున నితిన్ కుమార్ 13, మణీందర్ సింగ్ 8 పాయింట్లు సాధించారు. అంతకు ముందు నేడు జరిగే మ్యాచ్‌ల్లో రాత్రి 8 గంటలకు యూపీ యోధాస్‌తో దబంగ్ ఢిల్లీ , రాత్రి 9 గంటలకు పుణేరి పల్టన్‌తో పట్నా తలపడతాయి.