HIT 3

HIT 3: కీలక పాత్రలో మరో బిగ్ స్టార్!

HIT 3: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందిస్తున్న ఈ చిత్రం, సూపర్ హిట్ ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌లు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. ఈ మూవీలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. రక్తపాతంతో కూడిన యాక్షన్ సీన్స్‌తో ఈ పాత్ర ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని టాక్. అర్జున్ సర్కార్‌ను జాలి, దయ లేని కఠినమైన పోలీస్ ఆఫీసర్‌గా చూపించనున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కామియో రోల్‌లో కనిపించనున్నాడు. ఆ పాత్ర ‘హిట్-4’కి లీడ్‌గా మారనుందని నాని స్వయంగా చెప్పాడు. తాజా బజ్ ప్రకారం, ఈ కామియో రోల్‌లో తమిళ హీరో కార్తి నటించే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం ‘సర్దార్-2’తో బిజీగా ఉన్న కార్తి, తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితుడు కావడంతో ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. ‘హిట్-3’తో నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా నాని కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jagadeesh Inner Politics: మాజీ ఎమ్మెల్యేలపై కర్ర పెత్తనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *