Jana Nayagan

Jana Nayagan: భారీ ధరకి ‘జన నాయగన్’ ఓటిటి రైట్స్!

Jana Nayagan: విజయ్ హీరోగా, పూజా హెగ్డే, మమిత బైజు కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘జన నాయగన్’. విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. విజయ్ ఒకవైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే, దర్శకుడు హెచ్ వినోద్ టీమ్‌తో కలిసి ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమా ఓటీటీ హక్కులపై ఇప్పుడు సాలిడ్ బజ్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుందట. ఏకంగా 121 కోట్లు చెల్లించి ‘జన నాయగన్’ పాన్ ఇండియా ఓటీటీ రైట్స్‌ని ప్రైమ్ వీడియో కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది విజయ్ కెరీర్‌లో ‘లియో’ తర్వాత అత్యధిక ఓటీటీ డీల్‌గా చెప్పుకుంటున్నారు.

Also Read: Arya 2: ఆర్య-2 రీరిలీజ్ బుకింగ్స్ లో సెన్సేషన్!

Jana Nayagan: ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా, కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. ఇక, వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి, విజయ్ ఫైనల్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *