Traffic Rules:ఇది నిజం.. కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన నాటి నుంచి పెండింగ్ ఈ-చలాన్‌లు ఉన్న వాహనదారులకు ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తమ వాహనాలపై ఉన్న ఫైన్లను మూడు నెలల్లో చెల్లించని వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు పెండింగ్ చలాన్లు ఉన్న వారు తస్మాత్ జాగ్రత్త. ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించుకోండి.
Traffic Rules:ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబ్బంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్సు కనిష్టంగా మూడు నెలలు సస్పెండ్ చేస్తారు.
చెల్లించని ఈ-చలాన్లను వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం 40 శాతంగా ఉన్న ఈ-చలాన్ల వసూలును నూరుశాతం పెంచేందుకే ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
Traffic Rules:మోటర్ వాహనాల చట్టంలోని 136(ఏ) సెక్షన్ కింద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు ఉపయోగించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘటనలను మరింత పకడ్బంధీగా పసిగట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. సీసీ టీవీ కెమెరాలు, స్పీడ్ గన్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్లను, బాడీ-వార్మ్ కెమెరాలతో పసిగట్టనున్నారు.
Traffic Rules:దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలను జారీచేసింది. సెంట్రల్ మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను అమలు చేసేలా ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆదేశించింది.