CM Revanth Reddy:

CM Revanth Reddy: నేడు బీసీల మహా ధ‌ర్నా కోసం ఢిల్లీకి సీఎం రేవంత్‌, మంత్రులు

CM Revanth Reddy: దేశ రాజ‌ధాని మ‌హా న‌గ‌రమైన ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ బీసీ సంక్షేమ సంఘం జాతీయ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఈ రోజు (ఏప్రిల్ 2) బీసీల పోరుగ‌ర్జ‌న మ‌హా ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ధ‌ర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి త‌ర‌లివెళ్లారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని బీసీ ముఖ్య నేత‌లు, వివిధ ప్రాంతాల నుంచి ప్ర‌తినిధులు ఢిల్లీలోనే ఉన్నారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతానికి పెంచుతూ ఇటీవ‌లే రాష్ట్ర అసెంబ్లీ ఉభ‌య స‌భ‌ల్లో రెండు బిల్లుల‌ను ప్ర‌భుత్వం ఆమోదించింది.

CM Revanth Reddy: ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో బిల్లును ఆమోదించి, అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఈ ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. దేశ‌వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. 33 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అమ‌లులోనూ బీసీ మ‌హిళ‌ల‌కు స‌బ్ కోటాను కేటాయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్త‌డిని పెంచేందుకు ఈ ధ‌ర్నాలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు, రాష్ట్ర సీఎం, ఇత‌ర ముఖ్య నేత‌లు పాల్గొనున్నారు.

CM Revanth Reddy: ఈ మ‌హా ధ‌ర్నాలో లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, కొండా సురేఖ‌, బీసీ ఎమ్మెల్యేల బృందం, కీల‌క కాంగ్రెస్ నేత‌లు హాజ‌రు కానున్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్రంలోని మంత్రుల‌ను, వివిధ జాతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసి బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపు బిల్లును పార్ల‌మెంట్‌లో ఆమోదించాల‌ని కోర‌నున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *