Telangana News:

Telangana News: ఒక‌టి కాదు ఏకంగా 10 ఉద్యోగాలు కొట్టేసిన‌ యువ‌కుడు

Telangana News: ఒక ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఏళ్లుగా ఎంద‌రో రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. అయినా కొంద‌రికే ఆ స‌రస్వ‌తి ద‌రిచేరుతుంది. మ‌రి రెండు, మూడు, నాలుగు ఉద్యోగాలు ఆ ఒక్క‌రికే వ‌చ్చాయంటూ స‌రస్వ‌తీ పుత్రుడు, పుత్రిక అని స‌మాజం కొనియాడుతుంది. అటువంటిది.. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఆ యువ‌కుడిని వ‌రించాయంటే ఏమ‌నాలి. అంత‌కంటే ఎక్క‌వే అనాలి. మ‌రి అలాంటి 9 ఉద్యోగాల‌ను అవ‌లీల‌గా కొట్టేసిన ఆ యువ‌కుడు తాజాగా విడుద‌లైన టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాల్లో 70వ ర్యాంక‌ర్‌గా నిలిచి 10వ ఉద్యోగాన్ని కొట్టేశాడు.

Telangana News: భూపాల‌ప‌ల్లి జిల్లా గుంటూరు ప‌ల్లి గ్రామానికి చెందిన వీ గోపీకృష్ణ ప్ర‌స్తుతం మోట‌ర్ వెహికిల్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎంవీఐ)గా శిక్ష‌ణ పొందుతున్నారు. త్వ‌ర‌లో గ్రూప్‌-1 ఆఫీస‌ర్‌గా ఉద్యోగంలో జాయిన్ కానున్నారు. ఇలా 10 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను పొందిన గోపీకృష్ణ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచాడు. త‌న అసాధార‌ణ ప్ర‌తిభ‌ను మ‌రోసారి చాటి వార్త‌ల్లో నిలిచారు.

Telangana News: వీ గోపీకృష్ణ పొందిన వాటిలో 7 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు కాగా, 3 రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. విశేష‌మైన ప్ర‌తిభ‌తో రాసిన ప్ర‌తి పోటీ ప‌రీక్ష‌లో నెగ్గుకుంటూ ఉద్యోగాన్ని పొందుతూ వ‌చ్చారు. గోపీకృష్ణ క‌ష్ట‌ప‌డి చ‌దువుతాడ‌ని, స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌తో ముందుకు వెళ్తార‌ని కుటుంబ స‌భ్యులు, తోటి స్నేహితులు చెప్తుంటారు. త‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ నేడు గ్రూప్‌-1 ఆఫీస‌ర్ స్థాయికి ఎదిగార‌ని అంటున్నారు.

Telangana News: ఇంత‌టి విజ‌యాల‌ను సొంతం చేసుకున్న వీ గోపీకృష్ణ త‌న స‌క్సెస్‌పై ఏమంటారంటే? క‌ష్టం చేస్తే ఏదైనా సాధ్య‌మే. నిరాశ చెంద‌కుండా ముందుకు సాగితే విజ‌యాలు సొంత‌మే.. అని సింపుల్‌గా చెప్పారు. ఇప్ప‌టికే 10 ఉద్యోగాలు పొందిన ఆ యువ‌కుడు మ‌రింత ఉన్న‌త హోదా క‌లిగిన జాబ్ కొట్టాల‌న్న సంక‌ల్పంతో ఉండ‌టం విశేష‌మే. మ‌రి 11వ జాబ్‌తో ఉన్న‌తాధికారిగా మారాల‌ని ఆశిద్దాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *