The Family Man – Season 3: సీరీస్ సమంతను పాన్ ఇండియా స్టార్ చేసంది. ఈ వెబ్ సీరీస్ తో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఉత్తరాది వారికి కూడా అభిమాన నటిగా మారింది. అదే ఊపులో రాజ్ డికె కాంబోలో ఇప్పుడు ‘సిటాడెల్’ సీరీస్ కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రాజ్ డికె ద్వయం ‘ది ఫ్యామిలీ మేన్3’ తెరకెక్కిస్తున్నారు. ఈ సీరీస్ కొత్త సీజన్ లో జైదీప్ ఆహ్లావత్ తో పాటు నిమ్రత్ కౌర్ ను విలన్స్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం నాగాలాండ్ లో షూటింగ్ జరుగుతోంది. నిమ్రత్ కి ‘ది లంచ్ బాక్స్’ మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తర్వాత అమెరికన్ సీరీస్ ‘హోమ్ లాండ్ అండ్ వేవార్డ్ పైన్స్’లోనూ, ‘ఎయిర్ లిఫ్ట్, దస్వీ’ వంటి మూవీస్ లో నూ నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మేన్3’లో చేస్తున్న విలన్ పాత్ర మరింత ఇమేజ్ ని తెచ్చిపెడుతుందని నమ్ముతోంది. మరి సమంతకు ‘ది ఫ్యామిలీ మేన్2’ ఎంత పేరు తెచ్చిందో నిమ్రత్ కు ‘ఫ్యామిలీ మేన్ 3’ అంత పేరు తెచ్చిపెడుతుందని ఆశిద్దాం. లెట్స్ హోప్ సో.
