Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన ఏకంగా 6,075 కోట్ల రూపాయలతో అత్యాధునిక లగ్జరీ క్రూయిజ్ షిప్ కొన్నారని, ఇది సునామీలు, భూకంపాలను తట్టుకునే సామర్థ్యంతో పాటు 474 బాత్‌రూమ్స్, 350 బెడ్‌రూమ్స్, వాటర్ పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లతో సూపర్ లగ్జరీగా ఉంటుందని టాక్. అండమాన్ నుంచి లండన్ వరకు ప్రపంచాన్ని చుట్టేసే ఈ షిప్‌లో ప్రయాణించాలంటే జేబు నిండా డబ్బు కావాలట. అంతేకాదు, ఈ షిప్ ద్వారా చిరంజీవికి ఏటా 125 కోట్ల లాభం వస్తుందని, రామ్ చరణ్‌తో కలిసి అపార సంపద ఆర్జిస్తున్నారని గుసగుసలు. నెట్టింట ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.కానీ ఇవంతా కేవలం గాలి కబుర్లే అని తెలుస్తుంది. అసలు చిరంజీవి ఎలాంటి క్రూయిజ్ షిప్ కొనలేదని తేలిపోయింది. హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియన్స్ ఎకో పార్క్‌లో సీఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలను ఎడిట్ చేసి, విదేశీ షిప్ వీడియోలను జోడించి ఈ రూమర్‌ను సృష్టించారు. దీంతో ఈ అసలు విషయం తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంత భారీ ఊహాగానం వెనక నిజం లేకపోయినా, చిరు గురించిన ఈ గాసిప్ మాత్రం నెట్టింట రచ్చ చేస్తుంది.