Horror Thriller OTT: ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జాతో పాటు కోలీవుడ్ యువ నటుడు జీవా నటించిన తాజా చిత్రం ‘అగత్యా’. హారర్ మరియు మెడికల్ నేపథ్యంతో దర్శకుడు పా. విజయ్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, హారర్ మరియు ఫాంటసీ అంశాలతో పాటు సిద్ధ వైద్యానికి సంబంధించిన చారిత్రక సన్నివేశాలు ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Also Read: Mazaka: ఓటిటిలోకి వచ్చేసిన మజాకా!
Horror Thriller OTT: ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది. ఈ రోజు నుంచి ‘అగత్యా’ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు సన్ నెక్స్ట్‌లలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే లభిస్తోంది. థియేటర్లలో చూడని వారు ఇప్పుడు ఈ ఓటీటీలలో సినిమాను చూసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, ఇషారి కె. గణేష్ మరియు అనీష్ అర్జున్ దేవ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.

