Byreddy: 2019లో 151 సీట్లతో గెలిచి ఆంధ్రప్రదేశ్‌ను ఊపేసిన వైసీపీ, 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేకపోయింది. ఎన్నికల ముందు కొందరు నేతలు పార్టీని వీడగా, ఫలితాల తర్వాత మరికొందరు గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు మిగిలిన వాళ్లనైనా కాపాడుకోవాలన్న ఆత్రుతతో జగన్ కొత్త పదవుల సృష్టికి తెరలేపారు. అనుబంధ విభాగాలకు “వర్కింగ్ ప్రెసిడెంట్”లను నియమిస్తూ, పార్టీలో కొత్త సంస్కృతిని పరిచయం చేశాడు. ఇందులో భాగంగా యువజన విభాగానికి “వర్కింగ్ ప్రెసిడెంట్” పదవి క్రియేట్ చేసి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కట్టబెట్టారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి… ఈ పేరు వినగానే రాయలసీమ ఫ్యాక్షన్ డైలాగులు, యూట్యూబ్ రచ్చ, జగన్ భజన గుర్తొస్తాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న బైరెడ్డి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ – శాప్ చైర్మన్‌గా వ్యవహరించారు. “ఆడుదాం ఆంధ్రా” స్కీమ్‌లో భాగంగా స్కామ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో కలిసి వివాదాల్లో చిక్కుకున్న బైరెడ్డి.. ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ జగన్ ఇవ్వలేదు. ఇప్పుడు పార్టీ పరాజయం తర్వాత.. పిలిచిమరీ.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ను కట్టబెట్టారు. ఇది చూస్తే.. “రాజు కరుణ” అనాలా, “పార్టీ దీనస్థితి” అనాలా అర్థం కాని పరిస్థితి అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
సిద్ధార్థ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, కానీ రాజకీయ చతురతలో ఎక్కడో అడుగులు తడబడుతూ ఉంటాయి. అనుకోకుండా వచ్చిన యూట్యూబ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ స్టార్‌డమ్‌తో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లని చులకనగా మాట్లాడుతూ… జగన్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ భజనలో టైమ్ పాస్ చేసిన బైరెడ్డికి.. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు జగన్ రెడ్డి. ఇలా సిద్ధార్థరెడ్డి రాజకీయ జీవితం ఒక సినిమా స్క్రిప్ట్‌లా సాగుతోంది.
Also Read: Punjab Encounter: బర్నాలాలో పోలీసులు, గ్యాంగ్ స్టర్ల మధ్య కాల్పులు, తర్వాత ఏం జరిగిందంటే ?
Byreddy: ఇప్పుడు ఈ కొత్త పదవి చూస్తే, జగన్ తన నేతలను కాపాడుకోవాలన్న ఆత్రుతలో “పదవుల ఫ్యాక్టరీ” ఓపెన్ చేసినట్లుంది. అనుబంధ విభాగానికి సైతం “వర్కింగ్ ప్రెసిడెంట్” ఏమిటో ప్రజలకు అర్థం కాకపోయినా, సిద్ధార్థకు మాత్రం ఇదొక లైఫ్‌లైన్‌లా కనిపిస్తోంది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. పార్టీ ఓడిపోయి, ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు, ఈ పదవులు ఏం పనికొస్తాయి? అంటూ ఆ పార్టీ నేతలే నిట్లూరుస్తున్న పరిస్థితి.
బహుషా బైరెడ్డిలా తనకు విశ్వాసంగా ఉండే వారికి.. పార్టీలో పదవులు దొరుకుతాయని జగన్ సందేశం ఇవ్వదలుచుకున్నారేమో తెలీదు కానీ… ఇప్పుడు కూడా నోరేసుకుని పడిపోయే వాళ్లకే పదవులు ఇస్తూ పోతే.. పార్టీ మరింత డీలా పడదా? అని అడిగే వాళ్లూ ఉన్నారు. రాజకీయంగా ఫ్లాప్ యూట్యూబర్‌లా మిగిలిపోయిన ఇలాంటి వారికి పదవులు ఇస్తే.. లైక్‌లు వస్తాయి కానీ ఓట్లు రావు కదా జగనన్నా అంటున్నారు విజ్ఞత కలిగిన వైసీపీ ఫ్యాన్స్.