Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన పన్నెండవ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దీనిని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే శ్రీలంకలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్కడి అభిమానులతో విజయ్ దేవరకొండ మిలాఖత్ అయ్యారు. వారి అభిమానాన్ని చూరగొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కేరళ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత చిత్ర నిర్మాతలు దీనికి సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. కేరళలో యాక్షన్ సీక్వెన్స్ తీశామని, దీనితో 90 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని తెలిపారు. విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయబోతున్నారు. ఇటీవల వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’తో తన ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో అయినా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
#VijayDeverakonda about #VD12 Kerala Schedule @TheDeverakonda pic.twitter.com/xNBNYRzm2N
— Suresh PRO (@SureshPRO_) October 18, 2024