Bloody Beggar: విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అదే తరహా కథలతో మూవీస్ తీయడానికి తమిళ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఆ కోవకు చెందిన సినిమానే ‘బ్లడీ బెగ్గర్’. తమిళ బిగ్ బాస్ షో తో గుర్తింపు తెచ్చుకున్న కవిన్ నటించిన సినిమా ఇది. ఆ మధ్య కవిన్ ‘దాదా’ అనే సినిమాతో తెలుగువారి ముందుకు వచ్చాడు. ఇప్పుడీ ‘బ్లడీ బెగ్గర్’ మూవీ చేస్తున్నాడు. రకరకాల వేషాలు వేసి అడ్డుకునే ఓ యువకుడు అనుకోకుండా ఓ పెద్ద భవంతిలోకి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ‘బడ్లీ బెగ్గర్’ కథ. దీపావళి కానుకగా ఈ నెల 31న ‘బ్లడీ బెగ్గర్’ విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… ‘బీస్ట్’, ‘జైలర్’ చిత్రాల దర్శకుడు నెల్సన్… ఈ మూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.

