KTR: హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదరిస్తుర్రు

హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.హైదరాబాద్‌లో రోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే నగరం లేదని వెల్లడించారు.నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించామని చెప్పారు. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోయడానికి రేవంత్‌ రెడ్డి దొరికాడని చెప్పారు.

మూసీ బఫర్‌ జోన్‌లో ఉన్నవాళ్లను కబ్జాదారులని రేవంత్‌ ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్‌ హయాంలోనే ఈ ఘనతను సాధించామన్నారు.మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని చెప్పారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోయడానికి రేవంత్‌ రెడ్డి దొరికాడని చెప్పారు.

రేవంత్‌ రెడ్డి తనను మూసీ వద్ద 3 నెలలు ఉండాలని అంటున్నడు.. 60-70 ఏండ్ల నుంచి ప్రజలు ఇక్కడే ఉంటున్నారని తెలుసుకోవాలన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేండ్లు ఉంటానని స్పష్టం చేశారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, కొత్తగా రేవంత్‌ చెప్పాల్సింది లేదన్నారు. సోకుల కోసం పేదలను రోడ్డున పడేయొద్దని ముఖ్యమంత్రికి సూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *