Hyderabad: హైదరాబాద్ నగరం నడిబొడ్డున శనివారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. పంజాగుట్ట చౌరస్తా సమీపంలోని ప్రజాభవన్ పక్కన నడిరోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకున్నది. అతివేగంగా దూసుకొచ్చిన ఆ కారు పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానకు తరలించారు.

