Telangnana: రేవంత్‌రెడ్డిపై హ‌రీశ్‌రావు ఘాటు వ్యాఖ్య‌లు.. ప్ర‌భుత్వ వైఖ‌రిపై మండిపాటు

Telangnana:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హ‌రీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్ర‌భుత్వంపైనా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.
శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ వాన‌కాలం సీజ‌న్‌లో అన్న‌దాత‌ల‌కు రైతు భ‌రోసా ఇవ్వ‌లేని సీఎం రేవంత్‌రెడ్డి ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ వాన‌కాలం రైతు భ‌రోసా ఇవ్వ‌లేమ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన‌ట్టు చెప్పార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Telangnana:ఎన్నిక‌ల ముందు బీఆరెస్ ప్ర‌భుత్వం రూ.10 వేలు ఇస్తుంద‌ని, తాము అధికారంలోకి వ‌స్తే రూ.15 వేలు ఇస్తామ‌ని చెప్పి, ఈ నాడు మాట త‌ప్పినందుకు ఏమ‌నాల‌ని ప్ర‌శ్నించారు. రూ.ఒక ల‌క్షా 50 వేల కోట్లు మూసీ ప్రాజెక్టుకు ఉంటాయి కానీ, రైతుల‌కు రూ.15 వేలు ఇవ్వ‌లేవా అని నిల‌దీశారు. రుణ‌మాఫీ విష‌యంలో మోసం చేశావు, బోన‌స్ విష‌యంలో మోసం చేశావు, ఇప్పుడు రైతు పెట్టుబ‌డి విష‌యంలోనూ మోసం చేశావ‌ని విమ‌ర్శించారు.

Telangnana:మాట త‌ప్పిన ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీయాల‌ని హ‌రీశ్‌రావు రైతుల‌కు పిలుపునిచ్చారు. ఈ ప్ర‌భుత్వం రైతుల‌కిచ్చిన హామీల‌నే అమ‌లు చేయ‌లేక‌పోతుంది. ఇత‌ర హామీల‌ను ఎలా అమ‌లు చేస్తుందో ప్ర‌జ‌లే అర్థం చేసుకోవాల‌ని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *