Bus Accident: హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపై శనివారం (మార్చి 22) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏఎస్పీ దుర్మరణం పాలయ్యారు. రోడ్డు దాటుతున్న ఆయనను రెండు బస్సులు ఢీకొనడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఈ ఘటన తెల్లవారుజామున 4.30 గంటలకు చోటుచేసుకున్నది.
Bus Accident: హైదరాబాద్ హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం కాలనీ మైత్రీ కుటీర్‌లో అడిషనల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జీ నివాసం ఉంటారు. ఆయన రాచకొండ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం తెల్లవారుజామున ఆయన జాతీయ రహదారిపై మార్నింగ్ వాక్కు ప్రతిరోజూ మాదిరిగానే వెళ్లారు.
Bus Accident: ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో రోడ్డు దాటుతుండగా, తొలుత ఒక బస్సు ఢీకొనడంతో ఆయన కింద పడ్డారు. ఇదే సమయంలో ఆ బస్సు వెనుకాలే వచ్చిన నూజివీడు డిపో ఆర్టీసీ ఆయనను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేవారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతితో లక్ష్మారెడ్డిపాలెం కాలనీ మైత్రీ కుటీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.