Happiest Contries:

Happiest Contries: సంతోష‌క‌ర‌మైన దేశాల్లో ఇండియాది ఎన్నో స్థానం.. ఆ దేశానికే అగ్ర‌స్థానం

Happiest Contries: సంతోష‌మే స‌గం బ‌లం అని మ‌న పూర్వీకులు ఏనాడో సెల‌విచ్చారు. ఆనాడు నిస్వార్థ‌మైన జీవ‌నంలో హ‌ద్దులు లేని సంతోషంతో వారు బ‌తికేవారు. మారుతున్న కాల‌మాన ప‌రిస్థితులకు అనుగుణంగా ఆ సంతోషం ఉన్న‌దా? అంటే చాలా దేశాల్లో లేదు అనే చెప్పాలి. ఎందుకంటే మానవ అవ‌స‌రాలు, స్వార్థం, లాభం పెరిగి మ‌నిషి జీవితంలో సంతోష‌మ‌నేదే లేకుండా పోయింది. కానీ, ఇప్ప‌టికీ కొన్ని దేశాలు అలాంటి సంతోష‌మయ జీవ‌నంతో ఉన్నారంటే అదివారి అదృష్ట‌మ‌నే చెప్పాలి. ఇటీవ‌ల ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో సంతోష‌క‌ర దేశాల జాబితాను తాజాగా విడుద‌ల చేసింది.

Happiest Contries: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంట‌ర్ నిర్వ‌హించిన 2025 స‌ర్వేలో మ‌న దేశానికి ఎన్నో స్థానం వ‌చ్చింది? అగ్ర‌స్థానం ఏ దేశానిది అనే విష‌యాలు తేలిపోయాయి. అయితే గ‌తేడాది కంటే ఈ సారి మ‌న‌దేశానికి కొంత మెరుగైన స్థానం రావ‌డం విశేషం. మ‌రి మ‌న‌దేశ స్థానం ఎంతో తెలుసా? 118వ ర్యాంకుతో స‌రిపెట్టుకున్న‌ది. గ‌తేడాది అదే ర్యాంకు 126వ ర్యాంకులో ఉన్న‌ది. ఈసారి 8 స్థానాల‌కు ఎగ‌బాకింది అన్న‌మాట‌.

Happiest Contries: వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంట‌ర్ 2025 స‌ర్వేలో ఒక చిన్న దేశానికి అగ్ర‌స్థానం ద‌క్కింది. ఈ ఒక్క‌సారే కాదు.. ఇది 8వ సారి కావ‌డం విశేషం. యూర‌ప్ ఖండంలో ఉన్న పిన్లాండ్ దేశం 8వ సారి అత్యంత ఆనంద‌మ‌య దేశంగా టాప్‌లో నిలిచింది. మ‌న పొరుగున ఉన్న దేశాల ప‌రిస్థితి మ‌న‌క‌న్నా మెరుగ్గా ఉండ‌టం గ‌మ‌నార్హం. నేపాల్ 92, చైనా 68, పాకిస్థాన్ 109వ‌ స్థానంలో ఉన్నాయి.

Happiest Contries: మ‌న‌క‌న్నా మ‌న పొరుగుదేశాలు కొన్ని వెనుక‌బ‌డి ఉన్నాయి. వాటిలో శ్రీలంక 133, బంగ్లాదేశ్ 134వ స్థానంలో నిలిచాయి. అయితే అఫ్ఘానిస్తాన్ దేశం మ‌రోసారి 147వ దేశంగా ఆఖ‌రు స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. అగ్ర‌రాజ్య‌మైన అమెరికా దేశం 24వ స్థానంలో నిలిచింది. ఇజ్రాయిల్ దేశం 8వ స్థానంలో నిలిచింది.

Happiest Contries: కుటుంబాల్లో ఆనందాలు క‌లిగేలా క‌లిసి భోజ‌నం చేసే సంస్కృతిపైనా నివేదిక వివ‌రాలు సేక‌రించింది. భార‌తీయులు స‌గ‌టున నాలుగు భోజ‌నాలు మాత్ర‌మే క‌లిసి చేస్తుండ‌టంతో ఈ విభాగంలో ఆఖ‌రు వ‌రుస‌లో చేరింది. మ‌న‌దేశంలో పెరుగుతున్న ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌కు, మారుతున్న ప్ర‌జ‌ల జీవ‌న శైలుల‌కు ఇది అద్దం ప‌డుతున్న‌ది. అదే పిన్లాండ్ దేశంలో ఇప్ప‌టికీ ఆ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు ఆనందంగా ఉండ‌టానికి ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ది. అక్క‌డి వాతావ‌ర‌ణం కూడా అందుకు అనుగుణంగా ఉంటుంది. అక్క‌డి ఉద్యోగుల్లో లంచాలు ఉండ‌వంటే న‌మ్మండి. అందుకే ఆదేశంలో ఆనందం వెల్లివిరుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *