Assembly: 18 మంది ఎమ్మెల్యేలను.. ఆరు నెలలపాటు సస్పెన్షన్..

Assembly: కర్ణాటక అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. హనీ ట్రాప్ ఆరోపణల వ్యవహారం పెద్ద దుమారం రేపగా, ఈ అంశంపై చర్చకు పట్టుబడిన బీజేపీ సభ్యులపై తీవ్ర చర్యలు తీసుకున్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్న కారణంగా బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేయడంతో పెద్ద చర్చ మొదలైంది.

స్పీకర్ యూటీ ఖాదర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ వంటి కీలక నేతలు కూడా ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, కర్ణాటక రాజకీయాల్లో హనీ ట్రాప్ ఆరోపణలు ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ప్రముఖ నేతలు ఈ హనీ ట్రాప్ టార్గెట్‌గా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసెంబ్లీలో ఈ అంశం పై చర్చకు ప్రయత్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయగా, ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవడంతో అసెంబ్లీలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హనీ ట్రాప్ ఆరోపణల వ్యవహారం, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వంటి అంశాలు కర్ణాటక రాజకీయాల్లో మున్ముందు పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశముంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *