Manipur Violence: మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు హ్మార్ తెగ నాయకుడు రిచర్డ్ హ్మార్‌పై దాడి చేశారు. దీంతో ఆ తెగ ప్రజలు న్యాయం కోరుతూ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. హ్మర్ తెగకు చెందిన ఒక బృందం భద్రతా దళాలపై రాళ్ళు రువ్వడం ప్రారంభించింది. పరిస్థితిని అదుపు చేయడానికి, భద్రతా దళాలు అల్లర్లపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపాయి. దీని తర్వాత, ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.
చురచంద్‌పూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇండియన్ సివిల్ సేఫ్టీ కోడ్ (BNS) సెక్షన్ 163 (గతంలో IPC సెక్షన్ 144) విధించారు. భద్రతా దళాల మోహరింపును కూడా పెంచారు.
గొడవ కారణంగా దాడి
మణిపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం జెన్‌హాంగ్ లమ్కాలోని వికె మాంటిస్సోరి క్యాంపస్‌లో హ్మార్ ఇన్‌పుయి సంస్థ ప్రధాన కార్యదర్శి రిచర్డ్ హ్మార్‌పై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం రిచర్డ్ తన కారును నడుపుతున్న సమయంలో అది టూవీలర్ పై వెళుతున్న ఒక వ్యక్తిని ఢీ కొట్టకుండా తృటిలో తప్పించగలిగారు. దీంతో రిచర్డ్ టూవీలర్ పై వెళ్తున్న యువకులతో వాగ్వాదానికి దిగాడు. దీని తరువాత వివాదం పెరిగిపోయి అవతలి పక్షం వారు రిచర్డ్‌పై దాడి చేశారు.
ఇది కూడా చదవండి: Aurangzeb Grave: ఔరంగ జేబు సమాధి తొలగింపు వివాదం.. నిరసనల పర్వం..
మా సభ్యులను పదే పదే లక్ష్యంగా చేసుకుంటున్నారు
దాడిని విమర్శిస్తూ, నిందితులను వెంటనే పట్టుకోవాలని హమర్ ఇన్పుయి అన్నారు. అలా చేయకపోతే, తామే చర్యలు తీసుకుంటామని కూడా వారు హెచ్చరించారు. “ఈ సంఘటన మొదటిది కాదు. ITLF సభ్యులను పదే పదే లక్ష్యంగా చేసుకుంటున్నారు, ఇది వేధింపులు, హింసల సంఘటనలను ప్రేరేపిస్తోంది. హ్మార్ నాయకత్వం – సభ్యులను నిశ్శబ్దం చేయడానికి, బెదిరించడానికి ప్రయత్నిస్తున్న ఈ పిరికి చర్యలను ఖండిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.