Chennai

Chennai: టీ కోసం ట్రైన్ దిగాడు.. కట్ చేస్తే.. 20 ఏళ్లు గొర్రెల కాపరిగా వెట్టిచాకిరీ..!

Chennai: 20 ఏళ్ల క్రితం, సుక్కు తన గ్రామంలోని మరికొంత మందితో కలిసి పాండిచ్చేరికి కూలీ పనుల కోసం రైల్లో బయలుదేరాడు. మార్గమధ్యంలో రైలు ఓ స్టేషన్‌లో ఆగినప్పుడు, టీ తాగేందుకు దిగాడు. అయితే తిరిగి వచ్చేసరికి రైలు అప్పటికే వెళ్లిపోయింది. వెంటనే అధికారులను అడిగినా, ఎటూ వెళ్లాలో తెలియక డబ్బుల్లేక అక్కడే ఉండిపోయాడు.

తిండి కోసం అటూ ఇటూ తిరుగుతున్న సుక్కును ఓ వ్యక్తి గొర్రెల కాపరిగా పనిలోకి పెట్టుకున్నాడు. తొలుత సాధారణ కూలీగా ఉండగా, క్రమంగా యజమాని బలవంతంగా తన దగ్గరే ఉంచి, కూలీ ఇవ్వకుండా పనికట్టేశాడు. బయటకు వెళ్లనీయకుండా, 20 ఏళ్లూ అక్కడే ఉండిపోయాడు.

శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో ఇటీవల తమిళనాడు కార్మికశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెట్టిచాకిరి చేస్తున్నవారిని గుర్తించే ప్రయత్నంలో, సుక్కు అధికారుల కంటపడ్డాడు. తన వివరాలు చెప్పిన తర్వాత, అధికారులు అతని అసలైన గ్రామాన్ని పార్వతీపురం మన్యం జిల్లా అని గుర్తించారు.

Also Read: America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గురు మృతి

తమిళనాడు కార్మికశాఖ అధికారులు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు సుక్కు ఫోటో పంపారు. పోలీసులను రంగంలోకి దింపి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతికారు. అయితే, అప్పటికే సుక్కు తన పేరు “అప్పారావు”గా మార్చుకోవడం, 20 ఏళ్ల గ్యాప్ కారణంగా పోలికలు మారిపోవడం వల్ల, గ్రామస్తులు గుర్తించలేకపోయారు.

Chennai: పలువురు యువకులు కూడా సుక్కును వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనంతరావు టంకాల అనే యువకుడు, సుక్కు కుమార్తె ములక్కాయవలసలో ఉందని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. చివరికి కుటుంబాన్ని కలిపిన అధికారులు, తండ్రిని చూసిన కుమార్తె భావోద్వేగానికి లోనైంది.

20 ఏళ్లుగా కష్టాలు అనుభవించిన సుక్కుకు, వెట్టిచాకిరీ చేసిన యజమాని చివరికి కూలీ డబ్బులు అందజేశాడు. అంతేకాకుండా, పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, సుక్కు జీవనోపాధి కోసం మేకల యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు సంతోషంతో మిన్నంటిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనుకోని తప్పిపోయిన జీవితం ఎట్టకేలకు సంతోషంగా ముగిసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mohan Babu: న‌టుడు మోహ‌న్‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *