Telangana:వన్యప్రాణులను తరలిస్తున్న ఓ వ్యాన్ బోల్తా పడింది. అందులో ఉన్న పులి, మొసలి, ఇతర జంతువులను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ వన్యప్రాణులను తరలించే వ్యాన్ బోల్తా పడింది. చుట్టూ జాలీ ఉండటంతో అందులోని జంతువులు సేఫ్‌గానే ఉన్నాయి.

Telangana:బిహార్ రాజధాని నగరమైన పాట్నాలోని సంజయ్‌గాంధీ బయోలాజికల్ జూపార్కు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు బన్నెరఘట్ట బయోలాజికల్ జూ పార్కుకు వ్యాన్‌లో తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. స్థానిక అధికారులు, పోలీసులు వ్యాన్‌ను సరిచేసి రోడ్డుపైకి తెప్పించేందుకు సహకరిస్తున్నారు.

