MWC 2025

MWC 2025: సూర్యకాంతితో ఛార్జ్ అయ్యే ల్యాప్‌టాప్ – లెనోవా Yoga Solar PC

MWC 2025: టెక్ ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లలో ఒకటైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) బార్సిలోనా ఫిరా గ్రాన్ వియా (Barcelona Fira Gran Via)లో జరిగింది. మార్చి 3 నుండి మార్చి 6 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ టెక్ కంపెనీలు తమ తాజా ఉత్పత్తులు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించాయి.

MWC 2025లో తమ కొత్త ల్యాప్‌టాప్‌లు, ఇతర ప్రీమియం ఉత్పత్తులను ప్రదర్శించిన ప్రముఖ కంపెనీల్లో లెనోవా కూడా ఒకటి. ఈ ఈవెంట్‌లో లెనోవా ప్రదర్శించిన ఉత్పత్తుల్లో అత్యంత ప్రత్యేకమైనది Yoga Solar PC Concept (POC). ఇది సూర్యకాంతితో పని చేసే ల్యాప్‌టాప్, ఇది ప్రత్యేకంగా ఇండోర్, అవుట్‌డోర్ వాడకానికి అనుకూలంగా రూపొందించబడింది. పార్కులు, స్టేషన్లు, రోడ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పని చేయాలనుకునే వారికి ఇది ఉపయోగపడేలా ఉంటుంది.

ఈ యోగా సోలార్ పీసీ కనిపించేందుకు రెగ్యులర్ ల్యాప్‌టాప్‌లా కనిపించినప్పటికీ, దీని వెనుక భాగంలో ఉన్న సోలార్ ప్యానెల్ అత్యంత ప్రత్యేకమైనది. ఇది బ్యాక్ కాంటాక్ట్ సెల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తూ, 24% కంటే ఎక్కువ సౌరశక్తిని విద్యుత్తుగా మారుస్తుంది. ఎండలో కేవలం 20 నిమిషాలు ఉంచితే, ఈ ల్యాప్‌టాప్ గంట పాటు వీడియో ప్లేబ్యాక్ చేయగలదు.

Also Read: Viral Video: థార్ డ్రైవర్ బీభత్సం . . ఎదురుగా వచ్చిన వారిని తొక్కుకుంటూ పోయాడు . .

ఇతర ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే, ఈ పీసీ తక్కువ బరువుతో, మన్నికైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని బరువు 1.22 కిలోగ్రాములు మాత్రమే, మందం 15 మిమీ మాత్రమే ఉండటంతో, దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అదనంగా, ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ పై పనిచేస్తుంది, తద్వారా అధిక పనితీరు, మెరుగైన పవర్ మేనేజ్‌మెంట్ అందిస్తుంది.

MWC 2025లో లెనోవా ప్రదర్శించిన ఈ వినూత్నమైన ల్యాప్‌టాప్, సస్టైనబిలిటీ & టెక్నాలజీ కలయికలో ముందడుగు అని చెప్పొచ్చు. శక్తిని ఆదా చేస్తూనే అత్యున్నత పనితీరును అందించేలా లెనోవా రూపొందించిన ఈ సోలార్ ల్యాప్‌టాప్ భవిష్యత్తు కోసం మంచి మార్గదర్శిగా నిలవనుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *