Health Tips

Health Tips: మజ్జిగ ఎక్కువగా తాగకండి.. వీళ్లు తాగితే మరింత డేంజర్ !

Health Tips: వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి నీటి శాతం ఎక్కువగా ఉండేలా పండ్లు, కూరగాయలతో పాటు, అనేక రకాల పానీయాలను తీసుకుంటాము. ఇందులో మజ్జిగ కూడా ఉంటుంది. మజ్జిగను పెరుగు నుండి తయారు చేస్తారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, భాస్వరం, విటమిన్ బి12 ఖనిజాలు మొదలైనవి ఉంటాయి. మజ్జిగ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

కొన్ని సమస్యలు ఉన్నవారికి మజ్జిగ మంచిది కాదు. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుంటే మజ్జిగ తాగకూడదు. రాత్రిపూట మజ్జిగ తాగడం మానుకోవాలి. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు మజ్జిగ తాగకూడదు. ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె జబ్బులు ఉన్నవారిలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం మానుకోవాలి.

Also Read :  Pomegranate For Skincare: దానిమ్మ తొక్కలతో మచ్చలేని మెరిసే అందం మీ సొంతం.. ఎలా వాడాలంటే?

Health Tips: మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.

రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి. అలాగే మరో మంచి చికిత్స ఉంది. చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దంచాలి. ఈ పేస్టును కుండలోపల పూసి, దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి.పిప్పళ్లను వర్ధమాన యోగం రూపంలో మజ్జిగతో వాడాలి. అంటే పిప్పళ్లను పది రోజుల వరకూ రోజుకొకటి చొప్పున పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *