Air India Flight: ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సోమవారం AI-119 కి బాంబు బెదిరింపు వచ్చింది. 8 గంటల 37 నిమిషాల విమాన ప్రయాణం తర్వాత, విమానాన్ని ముంబైకి మళ్లించారు. ఆ విమానంలో 322 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు.
విమానంలోని వాష్‌రూమ్‌లో బాంబు బెదిరింపు నోట్ దొరికిందని ఎయిర్ ఇండియా తెలిపింది. భద్రతా ప్రోటోకాల్‌లను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని మార్గమధ్యలో ముంబైకి తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు. విమానం 10:25కి ముంబై చేరుకుంది.
ఎయిర్ ఇండియా విమానం AI119 ముంబై విమానాశ్రయంలోని టెర్మినల్ -2 నుండి తెల్లవారుజామున న్యూయార్క్ బయలుదేరింది.
ఇది కూడా చదవండి: Sam Pitroda: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడాపై ఎఫ్ఐఆర్
ప్రస్తుతం భద్రతా సంస్థలు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నాయి. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము.మార్చి 11న ఉదయం 5 గంటలకు విమానం షెడ్యూల్ మార్చడం జరిగిందని ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రయాణీకులకు హోటల్ వసతి, ఆహారం, ఇతర అవసరమైన సహాయం అందించారు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి మా బృందం నిరంతరం క్షేత్ర స్థాయిలో పనిచేస్తోంది. మా అత్యంత ప్రాధాన్యత ప్రయాణీకులు, సిబ్బంది భద్రత అంటూ ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్కొంది.
ఈనెలలో చికాగో వెళ్ళాసిన విమానం కూడా వెనక్కి..
అంతకుముందు మార్చి 6న, చికాగో నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన మరో ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన ఐదు గంటల తర్వాత చికాగోకు తిరిగి రావలసి వచ్చింది. ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి సకాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు విమానయాన ప్రతినిధి సోమవారం తెలిపారు. మార్చి 6, 2025న విమానం గ్రీన్‌ల్యాండ్ మీదుగా ప్రయాణించినప్పుడు, విమానంలోని 12 టాయిలెట్లలో 11 విఫలమయ్యాయని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. దాదాపు 300 మంది ప్రయాణికులకు, ఒక టాయిలెట్ మాత్రమే పనిచేస్తోంది, అది బిజినెస్ క్లాస్‌లో ఉంది. అటువంటి పరిస్థితిలో, 14 గంటల ప్రయాణం తర్వాత, విమానం చికాగోలోని ఓ’హేర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి తీసుకురావాల్సి వచ్చింది.