Gold Rate Today: ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతుండటంతో వినియోగదారులు అంతుబట్టని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు పెరుగుతుంది. అయితే, తాజాగా మార్చి 9వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్థిరత కనిపిస్తున్నప్పటికీ, గత రోజుతో పోల్చితే కొంత పెరుగుదల కనిపిస్తోంది.
బంగారం ధరలపై అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు, డిమాండ్ మరియు సరఫరా వంటి అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గోల్డ్మన్ శాక్స్ నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి, దీని ప్రభావంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price 2025: గోల్డ్ కొనే వారికి బిగ్ షాక్.. రూ. లక్ష దాటనున్న పసిడి
తాజాగా మార్చి 10వ తేదీ ఉదయం 6 గంటల సమయానికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,850.
- బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,850.
- హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,850.
- విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,850.
- కోల్కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,850.
- ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,000.
- చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,900.
దీనివల్ల రోజువారీగా బంగారం కొనుగోలు చేసే వారు తమ అవసరాలను బట్టి ధరలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. బంగారం ధరలు ప్రతిరోజూ మారే అవకాశం ఉన్నందున, తాజా అప్డేట్ల కోసం ఎప్పటికప్పుడు గమనించడం అవసరం.