Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Hyderabad: ఒక్క నిమిషం చాలు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జరిగే ప్రమాదాలు నిండు నూరేళ్ళ జీవితాలను బాలి తీసుకుంటూ ఉంటె …ప్రాణాలు కోల్పోయిన బిడ్డలను చూసి ఇంట్లో వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రమాదం ఆ లిడార్ ఇంట్లో విషాదం నింపింది.

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు, మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు కనిష్క్ రెడ్డి మృతి చెందాడు. నగర శివారులోని గొళ్లపల్లి కలాన్ దగ్గర ఔటర్ రింగు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Also Read: Road Accident: హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ తీగ‌ల ఇంట‌ విషాదం

ఓఆర్ఆర్ పై కారులో ప్రయాణిస్తున్న కనిష్క్ రెడ్డి.. గొల్లపల్లి దగ్గరకు రాగానే.. ఔటర్ రింగు రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని గుద్దేశాడు. పూర్తి స్థాయి లోడ్ తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులోని యువకుడిని కిందకు దించారు. అతని జేబులోని ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పరిశీలించగా.. యువకుడు తీగల కృష్ణారెడ్డి మనుమడుగా గుర్తించారు.

కారులో నుంచి కనిష్క్ రెడ్డిని బయటకు దింపిన పోలీసులు అంబులెన్స్ ను రప్పించారు. అప్పటికే కొన ప్రాణాలతో ఉన్న కనిష్క్ రెడ్డికి.. ఎడమ వైపు భుజం దగ్గర, తలపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతను ప్రయాణిస్తున్న కారు.. లారీ కిందకు దూసుకువెళ్లడంతో బలమైన గాయాలు అయ్యాయి. తలకు అయిన బలమైన గాయాలతో అతను రోడ్డుపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. తుది శ్వాస విడిచాడు. దీంతో.. తీగల కృష్ణా రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *