NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ మామాలుగా లేదనే చెప్పాలి. ప్యాన్స్ ని పండగల వేళ పలకరించేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. ఈసారి థియేటర్లలో ఫ్యాన్స్ కి పండగానే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకు తగ్గట్టుగానే మూడు పండుగలకు మూడు సినిమాలను లైన్ లోనే పెట్టేశాడు ఎన్టీఆర్. వార్ 2 మూవీ చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్ తో కలిసి చేయాల్సిన పాట షూట్ ఇటీవలే మొదలయ్యింది. ఇంకో వారం రోజుల్లో ఆ పాట కూడా కంప్లీట్ అవుతుంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా దాదాపు పూర్తయినట్టే. ఈ సినిమాను ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు.ప్రశాంత్ నీల్ డ్రాగన్ ని ఈ ఏడాది నవంబర్ లోగా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 2026 సంక్రాంతి పండుగ రోజున విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.2026 దసరాకి దేవర 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. జూన్ నాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యే అవకాశముంది అంటున్నారు. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందట. ఇలా ఎన్టీఆర్.. మూడు పండుగలకు మూడు పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నాడు.

