Singer Kalpana: స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లి చికిత్సతో కోలుకున్న సింగర్ కల్పన ఈ రోజు (మార్చి 7) క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియో సందేశంలో ఘటనకు సంబంధించిన విషయాలపై వివరణ ఇచ్చారు. బుధవారం కోలుకున్న కల్పన తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని కేపీహెచ్‌బీ పోలీసులకు నిన్ననే వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు రికార్డు నమోదు చేసుకున్నారు.
Singer Kalpana: తనపై జరుగుతున్న ప్రచారాలపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియోను రిలీజ్ చేశారు. “ఒత్తిడి వల్లే డాక్టర్ సలహాతోనే స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకున్నాను. నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు. నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా భర్త, కూతురే. నాపై జరిగే ప్రచారంలో వాస్తవం లేదు. సరైన సమయంలో ఆయన పోలీసులను అలెర్ట్ చేశారు కాబట్టే నేను బతికాను” అని సింగర్ కల్పన వివరణ ఇచ్చారు.
Singer Kalpana: ఇదిలా ఉండగా, పోలీసులకు ఇచ్చిన వివరాల్లో పలు కీలక విషయాలను కల్పన వివరించారని తెలిసింది. గత ఐదేండ్లుగా నిజాంపేట రోడ్డులోని ఓ విల్లాలో తన భర్త ప్రసాద్ ప్రభాకర్‌తో ఉంటున్నానని పోలీసులకు ఇచ్చిన వివరాల్లో కల్పన పేర్కొన్నారు. ఈ నెల 3న కేరళలోని ఎర్నాకుళంలో ఉన్నప్పుడు తన కుమార్తె దయాప్రసాద్‌తో వాగ్వాదం జరిగిందని, తాను హైదరాబాద్‌లో చదువుకోవాలని చెప్తే ఆమె నిరాకరించిందని, ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, 4న హైదరాబాద్ వచ్చానని చెప్పారని తెలిసింది. మధ్యాహ్నం 1.40 గంటలకు ఇంటికొచ్చిన తర్వాత నిద్రపట్టకపోవడంతో మొదట 8 మాత్రలు, తర్వాత 10 మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు.. తెలిపారని సమాచారం.