America: తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ (27) అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ప్రవీణ్, గంప రాఘవులు, గంప రమాదేవీల కుమారుడు, గతేడాది ఎంఎస్ చదవడానికి అమెరికాలోని మిల్వాకీ, విస్కాన్సిన్ వెళ్లాడు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న అతను అక్కడే ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
Also Read: Murder: డాక్టర్ భర్తను చంపిన భార్య..
తాజాగా, అతను నివాసం ఉండే ఇంటి సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రవీణ్ మరణ వార్తతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

