Betel Leaves: పూజలు, ఉపవాసాలు, శుభ కార్యక్రమాలలో తమలపాకుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ఇది ముందుంటుంది. భోజనం తర్వాత తమలపాకులు తినడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కొన్ని వివాహాలు, వేడుకలలో, భోజనం తర్వాత తమలపాకుతో చేసిన కిల్లీ లేదా పాన్లను ఇస్తారు. అయితే ప్రతిరోజూ తమలపాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ ఒక్క ఆకు అనేక వ్యాధులను నయం చేస్తుందని చెబుతున్నారు. తమలపాకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మలమద్ధకానికి చెక్ :
భోజనం తర్వాత తమలపాకు తినడం శరీరానికి ఎంత మంచిదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తమలపాకు తినడం వల్ల మలబద్ధకం నయమవుతుంది. తమలపాకు రసం జీర్ణక్రియకు సహాయపడుతుంది. వివాహాలు మరియు ఇతర కార్యక్రమాలలో భోజనం తర్వాత తమలపాకులను నైవేద్యంగా పెడతారు.
నోటి దుర్వాసనకు:
తమలపాకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. ఇంకా కారంగా ఉండే తమలపాకు తిన్న తర్వాత నోరు తాత్కాలికంగా సువాసనగా ఉంటుంది.
Also Read: Drumstick: 300 కి పైగా వ్యాధులను నయం చేసే మునగకాయ
శ్వాసకోస వ్యాధులు:
ఆయుర్వేదం ప్రకారం..తమలపాకులు శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా లేదా డీహైడ్రేషన్ ఉంటే తమలపాకులు తినాలనినిపుణులు అంటున్నారు. ఇది ఈ రకమైన వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
చక్కెర శాతం:
తమలపాకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారు కొన్ని టేబుల్ స్పూన్ల తమలపాకు రసం తాగడం చాలా మంచిది. ఇది సహజంగా చక్కెర స్థాయిలను తగ్గించడానికి మంచి మార్గం.
ఆందోళనను తగ్గిస్తుంది:
తమలపాకులను నమలడం వల్ల ఆందోళన కొంచెం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫెలోనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

