Srisailam Temple: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నకిలీ టికెట్ల కలకలం రేగింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పాత తేదీల్లో ఉన్న సర్వదర్శనం టికెట్లను మార్పింగ్ చేసి భక్తులకు వేల రూపాయలకు అమ్మిన ఇద్దరు నిందితులపై ఆలయ సీఈవో మధుసూదన్‌రెడ్డి శ్రీశైలం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Srisailam Temple: ఈ మేరకు నకిలీ దర్శనం టికెట్ల విషయంపై పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ టికెట్ అమ్మకాలు, భక్తుల కొనుగోలుపై ఆరా తీస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఆ ఇద్దరు నిందితులు నకిలీ టికెట్లను ఇంటర్ నెట్‌లో పెట్టి భక్తులకు వేల రూపాయల్లో అమ్ముతూ దర్శనానికి పంపుతూ, సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వో, ఇతర అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది.
Srisailam Temple: స్వామివారిని దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు దర్శనం టికెట్లు ఇస్తామని చెప్పిన ఆ ఇద్దరు నిందితులు వారి వద్ద వేల రూపాయలను కాజేశారు. వారికి నకిలీ టికెట్లు ఇచ్చి లోపలికి పంపారు. వాటిని తీసుకొని ఆ భక్తులు క్యూలైన్‌లో వెళ్లారు. అక్కడి స్కానింగ్ సెంటర్ వద్ద వారిచ్చిన టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో వారిని సిబ్బంది అడ్డుకున్నారు. ఆ టికెట్లను పరిశీలించగా, అవి ఫేక్ టికెట్లని తేలింది. దీతో ఆలయన సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Srisailam Temple: దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. అయితే టికెట్లపై దేవస్థానం సీల్, సంతకం ఫోర్జరీపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉన్నది. ఏదైతేనేమి కానీ, అక్కడి లొసుగులు ఉన్న కారణంగానే యథేచ్ఛగా శ్రీశైలం క్షేత్రం వద్దే నకిలీ టికెట్లు అమ్మే ముఠా ఉండటం గర్హనీయం.

