Telangana: ఎవరి దేవుడు వారికి గొప్ప. మీ దేవుడు మాకు గొప్ప కాదు అంటూ..పక్క దేవుళ్లపై దాడి చేయడం ..ధర్మమేనా..? అసలు అలా పక్క మతం దేవుళ్లపై దాడి చేయమని ఏ మతం లో దేవుడు చెప్పాడు. దీనినే …డర్టీ మైండ్ ఫెలోస్ ఇన్ సొసైటీ అనేది. దేవుడికి దండం పెట్టుకో..కోరికలు కోరికో తప్పేమి లేదు. అలా అని …మా దేవుడే మాకు గొప్ప అని బరితెగిస్తే..మీ అనుకున్న దేవుడు కూడా క్షమించాడు.. ఇప్పటికి మన సమాజంలో అందరు దేవుళ్ళు సమానమే అనుకునే ..అన్ని మతాల మంచి మనుషులు ఉన్నారు. కానీ..ఈ మధ్య కాలంలో మాత్రం..మతం, దేవుడు, దాడులు ఎక్కువయ్యాయి. ఎందుకు అంటే ఒక్కటే కారణం…కలికాలం దగ్గర పడుతుంది కాబట్టి.
హైదరాబాద్‌లో దేవుళ్ల విగ్రహాలపై దాడులు చేయడం.. ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటన మరవకముందే నేడు మరో ఆలయంపై దాడి జరిగింది. తాగి గుడికి రావొద్దని పూజరి చెప్పడంతో రెచ్చిపోయిన ఓ తాగుబోతు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అడ్డుకున్న ఆలయ కమిటీ సభ్యులు నిందితుడి పోలీసులకు అప్పగించారు.
అంబర్ పేటలోని మహంకాళి టెంపుల్ లోకి వచ్చేందుకు ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. గమనించిన పూజారి.. తాగి ఆలయంలోకి రావడం సరికాదని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఆ తాగుబోతు.. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు అతడిని అడ్డుకున్నారు. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే.. పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
నిన్న సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడలో ఓ వ్యక్తి సైతం ఆలయంలోనికి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలను పెట్టాలని డిమాండ్ చేశారు.